Janakiram's profileStateless ComponentPhotosBlogLists Tools Help

Blog


    December 23

    Jai Chiranjeeva! - An Early Report

    జై చిరంజీవ!. ఈ సినిమా కోసం నేను చాలా రొజులుగా ఎదురుచూస్తున్నాను. మొదటి రొజు మొదటి ఆట కాకపొయినా, రెండొ రోజున మొదటి ఆటకి వెళ్ళగలిగా!

    చిరంజీవి సినిమా వస్తొంది అంటేనే అదొక తెలియని ఉద్వేగం, ఆనందం. అది కూడా రెండో రోజే చూడగలిగితే ఇక చెప్పనే అక్కరలేదు.

    కానీ, ఈ సారి కూడా చిరు తన అభిమానులకి నిరాశే మిగిల్చాడు. ఒక్క సారి చిరు పాత చిత్రాలన్ని తలచుకుంటే, మనకి గుర్తుకొచ్చేవి  చంటబ్బాయ్, రుద్రవీణ, విజేత, రాక్షసుడు, దొంగమొగుడు, కొండవీటి దొంగ, జగదేక వీరుడు అతిలోక సుందరి, కొదమ సిమ్హం, గ్యాంగ్‍లీడర్, ఘరానా మొగుడు, ముఠామేస్త్రి, ఇంద్ర, ఠాగుర్. ఇందులోని ప్రతి చిత్రంలోనూ చిరు తనదైన బాణీలొ మనందరినీ అలరించాడు. అసలు ఇవన్ని ఎందుకు, చిరు సినిమా అనగానె మనం ఏమి ఊహిస్తాం?

    ఓక అదిరిపొయే మేనరిజమ్, మంచి పట్టున్న పంచ్‍లైన్ - చెయ్యి చూసావ ఎంత రఫ్‍గా వుందో, రఫ్ అడించేస్తా అంటే అసలు ఇంక ఫాన్స్‍ని పట్టుకోగలమా?

    తర తరాలు గుర్తుండిపోయే డాన్సు స్టెప్పులు - పాప రీటా నించి, దాయి దాయి దామ్మ, కొడితే కొట్టాలిరా దాక ఒక ఊపు ఊపాడు చిరు.

    ఆలాంటిది, జై చిరంజీవలొ ఒక గుర్టుపెట్టుకునే పవుర్‍ఫుల్ డైలాగ్ కాని, మాంచి డాన్స్ స్టెప్ కాని ఎంత వెతికినా పొరపాటున కూడా కనిపించనేలేదు.

    త్రివిక్రమ్ శ్రీనివాస్, విజయభాస్కర్ కాంబినేషన్లొ వచ్చిన మన్మథుడు, మల్లీస్వరీ చిత్రాలు కధాపరంగా చాలా చక్కని చిత్రాలు. కాని ఈ సారి ఈ కాంబినేషన్ మాటల పంట అంతగా పండలేదు.

    మణిశర్మ సంగీతం కూడా అంతంత మాత్రం గానే వుంది.

    లారెన్స్ డాన్స్ మాయ ఈ సారి పెద్దగా పని చెయ్యలేదు.

    సమీరా రెడ్ది అసలు తెలుగు అమ్మాయి అవునా కాదా అన్నట్టు వుంది. కేవలం పాటలకు మాత్రమే పరిమితమయింది ఈ టెలుఘు అమ్మాయి పాత్ర! భూమిక నాజుకుగా, కధాపరంగా ఒక ముఖ్యమయిన పాత్రలో చక్కగా నటించింది.

    మీరు చిరంజీవి అభిమానులయెతే ఈ సినిమా ఒక్క సారి మాత్రం చూడవచ్చు.

    కానీ ఈ సినిమా చిరు ముందు చిత్రాల రికార్డులని బద్దలకొడుతుందని నేను అనుకోవట్లేదు.